RaspSadhanaBlog
20, ఏప్రిల్ 2012, శుక్రవారం
"Oh! My God!"-An inspiration from Vivekananda
"Oh! My God!"-
an inspiration from
Vivekananda
.We can understand the God in a different way with this poem.
A free Thelugu translation by
Bhat sadhana.
అడిగానమ్మా ఆ దైవాన్నీ- బల శక్తులనే యిమ్మనీ
యిచ్చాడైయ్యా జటిలమౌ- పరిస్థితులనే ఎదుర్కొ మ్మనీ
అడిగానైయ్యా ఆ దేవుణ్నీ - తెలివితేటలనే యిమ్మనీ
యిచ్చాడమ్మా తికమక పెట్టే - సమస్యలనే సాధించు కొమ్మనీ
అడిగానురోయ్ ఆ దైవాన్నీ - సుఖ సంతోషాలనే ప్రసాదిం చమనీ
చూపించాడురోయ్ సేవించమనీ -బాధలలో తేలి ములుగు తున్నవారి నెందరినో
అడిగానక్కా ఆ దేవుణ్నే- భోగభాగ్యాల కురిపించమనీ
ప్రదర్శించాడు - పరిశ్రమించే -సిరి సంపదల సృష్టికర్తలని
అడిగానన్నా ఆ దైవాన్నీ - అవసరాలనీ, సౌకర్యాల్నీ,విలాసాలనీ, కోరి కొసరుగా యిమ్మనీ
చూపాడు తమ్మీ - శ్రమియించీ సాధించే అవకాశాల ఆనవాళ్ళనీ
అడిగానండోయ్ అన్నిటిలోనీ ఆ దైవాన్నీ - అనంత శాశ్విత శాంతినిమ్మనీ
సుఖమునిమ్మనీ - స్వేచ్ఛ నిమ్మనీ
యిచ్చా డిచ్చా డిచ్చా డు - సాయం చేసి - మరీ చూపించాడూ -
పరులకు సాయపడే పలు సన్మార్గాలనీ
చూశారా మరి - వింత అనంతుడు - మాయ శాశ్వితుడు - మరి మన దేవుడు
కోరినదేదీ - అడిగినదేదీ యివ్వనేలేదూ - యధాతథంగా
వలసినవీ కావలసినవీ - కొసరి మరీ యిచ్చేశాడూ -
అమ్మా, ప్రకృతి,సమాజమూ - కళలూ,విప్లవ,విజ్ఞ్యానాలూ - అయాచితమ్ముగా
వేదాంతాలూ,బంధుత్వాలూ - శిష్యరికాలూ, స్నేహాలూ - యాదాలాపంగా
అందుకే మరి 'ఓహ్! మై గాడ్ ' అనుకోవడమే
తప్పదు మరి తప్పని సరి - అయిపోయింది .
@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి